Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హుటాహుటిన జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్, ఎలక్ట్రికల్ సిబ్బందిని వెంటపెట్టుకొని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తార్నాక డివిజన్లోని లాలాపేట్ ప్రధాన నాలా వెంబడి పర్యటించారు. ఈ సందర్భంగా నిలిచిన వర్షం నీటిని, విరిగిన చెట్ల, వంగిన స్తంభాలను తొలగించి రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. నాలా ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. అనంతరం శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ. వర్షాలను దష్టిలో ఉంచుకొని ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లల్లో ఉండరాదని అటువంటి ఏవైనా ఉంటే తమ దష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, అధికారులు రఘు, మిస్బా పాల్గొన్నారు.