Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఈనెల 31న డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ సద్వినియోగం చేసుకోవాలని ఫలకనుమా ఏసీపీ షేక్ జాహగీర్ అన్నారు. ఈమేరకు శుక్రవారం డీవైఎఫ్ఐ నాయకులతో కలిసి మోడల్ టెస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలకనుమా రైల్వే స్టేషన్ రోడ్డు జంగంమేట్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో జరిగే కానిస్టేబుల్ మోడల్ టెస్ట్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ఈ పరీక్ష జులై 31వ తేదీన ఉదయం 10:00గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ టెస్ట్‌తో అభ్యర్థులకు మోడల్ విధానం తెలుస్తుందని మరింత ప్రిపరేషన్‌కు దోహదపడుతుందని సూచించారు. దీంతో రానున్న పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలకు ప్రతి ఒక్కరు రాణించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పిస్తున్న భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ). నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి కష్ణ నాయక్ మాట్లాడుతూ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అభ్యర్థులు ఈఅవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీను, రాజేష్, ఈశ్వర్, హిరలాల్, వినోద తదితరులు పాల్గొన్నారు.