Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి
నవతెలంగాణ-ఓయూ
కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఓయూ ఎన్జీఓఎస్ (స్టాఫ్) అసోసియేషన్, టెక్నీకల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ కోసం రాష్ట్ర ఉద్యోగ సంఘాల, ఓయూ వీసీ, రిజిస్ట్రార్ లతో కలిసి సీఎం కేసీఆర్ దష్టికి తీసుకువెళ్లి చర్చించనున్నట్లు చెప్పారు. వీసీ ప్రొ. రవీందర్ మాట్లాడుతూ ఓయూ ఉద్యోగులకు పాతపద్దతిలో ప్రమోషన్ పాలసీ అమలు చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 30% పీఆర్సీ ఫిట్మెంట్ కోసం కమిటీ రిపోర్ట్ రాగానే ఈసీలో పెట్టి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఓయూలో ఉద్యోగులు సుమారు 30% అదనంగా ఉన్నారని, అయినా కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి తొలగింపు ఉండదు అని, ఉద్యోగ భద్రత కల్పించనునట్లు చెప్పారు. ఉద్యోగులు మొబైల్స్ అంటి పెట్టుకొని ఉండకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వహించలన్నారు. నాన్ టీచింగ్ హోమ్ మరమ్మతులకు రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఎన్జీఓఎస్ అధ్యక్షుడు బియాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ రానున్న మూడేండ్లలో ఓయూ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించి దీర్ఘకాలికంగా అపరిష్కతంగా ఉన్న సీపీఎస్, టైం స్కేల్ ఉద్యోగుల రెగ్యులరైజ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలు కోసం చిత్తశుద్ధితో కషి చేస్తానని చెప్పారు. అడ్మిస్ట్రేటివ్ పదవుల్లో బోధనేతర ఉద్యోగులను నియమించాలని దానికి వీసీపై ఒత్తిడిని తీసుకువస్తామన్నారు. ఓయూ పదోన్నతుల్లో పారదర్శకత పాటిస్తూ పాతపద్దతిలోనే ప్రమోషన్ సిస్టమ్ అమలు చేసేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని జ్ఞానేశ్వర్ చెప్పారు. ఈసందర్భంగా మూడు బోధనేతర సంఘాల నుంచి గెలుపొందిన 27 మంది ఆఫీస్ బేరర్స్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీనారాయణ, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ రావు, టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు ఎం. రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, కె ఎస్. నాగరాజా రావు, టి.శివ శంకర్, ప్రధాన కార్యదర్శి రవి, ఎస్. విజరు కుమార్, అక్బర్ బేగ్, భీమయ్య, శంకరయ్య, శంకర్ నాయక్, రాకేష్, అవినాష్, సరోజ, భిక్షపతి, టైమ్‌స్కేల్ విఠల్, నారాయణ, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సూర్య చందర్, అంజయ్య, అభిలాష్, వీరేశం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.