Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన్ వార్డు కార్యాలయంలో దోమల నియంత్రణ, డెంగ్యూ వ్యాధి నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పి స్తున్న కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్ రెడ్డి. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రతి ఆది వారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు 10 వారాల పాటు పరిశుభ్రత పాటించాలన్నారు. వర్షాల నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులతో పాటు దోమల ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త లపై అవగాహనా కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ శ్రీకా రం చుట్టిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ద్వారా క్షేత్ర స్థాయిలో సీజనల్ అంటువ్యాధుల తోపాటు దోమల నివారణ, నియంత్రణకు సిిబ్బంది, అధికారులు ఇంటింటికి వెళ్లి అవగాహనతోపాటు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇంటి లోపల, పరిసరాల్లో దోమల నివారణకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని తెలి పారు. ఈ కార్యక్రమంలో మస్కిటో టీమ్, జవాన్ యాదగిరి, ఎస్ఎఫ్ఏలు, స్థానిక నాయకులు చారి, శేఖర్, మల్లయ్య, స్థానిక మహిళలు పాల్గొన్నారు.