Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి ప్రాధాన్యమి స్తూ సమయం కేటాయించాలని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు అన్నారు. మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు డీసీ రవి కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం కార్పొరేటర్ డివిజన్ పరిధిలోని చిత్తారమ్మ నగర్లో వీది వీది తిరిగి బస్తీవాసులతో మాట్లాడి నిల్వ ఉన్న నీటి ప్రదేశాలను గుర్తించారు. అనంతరం మురికి నిల్వ నీటి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇతర కాలానుగుణ వ్యాధుల నివారణలో భాగంగా ప్రజలంతా తమ తమ ఇంటి పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించాలన్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న కూలర్లో, చెట్ల కుండీల్లో, తోటల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సీహెచ్ ప్రభాకర్ గౌడ్, ఎంటమాలజీ సూపర ్వైజర్ నగేష్, శ్రీశైలం, సాయి, ఎస్తేర్, సుమ, అన్నపూర్ణ, శారద, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.