Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఒయాసిస్ ఫెర్టిలిటీ తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా కర్నూలులో ఐదో కేంద్రాన్ని ప్రారంభించింది. డాక్టర్ వహిదా, ప్రొఫెసర్, హెచ్ఓడీ, విశ్వభారతి మెడికల్ కళాశాల, కర్నూలు, కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాప కులు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జిరావు ''కర్నూలులో ప్రామాణికమైన, శాస్త్రీయమైన చికిత్సా పద్ధతులు అందుబాటులో లేకపోవడం వల్ల మా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించేందుకు ముందుకు వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో టీఎఫ్ఆర్ (టోటల్ ఫెర్టిలిటీ రేట్) 1.6కు పడిపోయింది. ఇది ఆందోళనకరమైన ధోరణి. అస్థిరమైన జీవనశైలి, జంక్ ఫుడ్లను తినడం, ఊబకాయం కలిగి ఉండటం, తల్లిదం డ్రులు కావాలనే కోరికను ఆలస్యం చేసుకోవడం వంటివి దేశంలో సంతానలేమి సమస్య బాగా పెరగడానికి ప్రధాన కారణాలుగా మారాయి. అనేక అధునాతన చికిత్సా పద్ద తులు అందుబాటులో ఉన్నాయనే వాస్తవాన్ని ఇక్కడ మేం నొక్కి చెప్పాలనుకుంటున్నాం'' అని తెలిపాఉ. సైంటిఫిక్ హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లా డుతూ ''ఫెర్టిలిటీ రంగంలో అద్భుతమైన పురోగతులు వచ్చాయి. ఐవీఎమ్, ఐసీఎస్ఐ, మైక్రో టీఈఎస్ఈ, పీజీటీ, ఈఆర్ఎ వంటి అత్యాధునిక సాంకేతికతలు సంతానసా ఫల్య విజయాల రేట్లను మెరుగుపరచడంలో సహాయపడ తాయి. రోగి ఫలితాలను మెరుగుపరచడానికి మా అన్ని చికిత్సలు సాంకేతికతతో మద్దతునిస్తాయి. మా ఐవీఎఫ్ ల్యాబ్లు అంతర్జాతీయ ప్రమాణాలతో సరిసమానంగా ఉంటాయి. మా చికిత్సలన్నీ ఎవిడెన్స్-బేస్డ్ ఆధారితమైన వి. మేం మొత్తం ఐవీఎఫ్ ప్రక్రియలో ఎటువంటి తప్పులు జరగకుండా ఉండడానికి ఈడబ్ల్యుఎస్ సాంకేతికతను ఉపయోగిస్తాం'' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతిర్మయి, ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్, విశ్వభారతి వైద్య కళాశాల, కర్నూలు, డాక్టర్ కిరణ్ కుమార్ స్పయిన్ సర్జన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ దుర్గా జి.రావు, ఒయాసిస్ ఫెర్టిలిటీ కో-ఫౌండర్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణచైతన్య, సైంటిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, ఒయాసిస్ ఫెర్టిలిటీ, డాక్టర్ విజయ లక్ష్మి డి, క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, కర్నూలు, శ్రీ సుధాకర్ జాదవ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఒయాసిస్ ఫెర్టిలిటీ, తదితరులు పాల్గొన్నారు.