Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జననాయక్ కర్పూరీ టాకూర్ వెల్ఫేర్ ట్రస్టు ప్రతినిధులు
- గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు వినతి
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
స్థానిక సంస్థల రాజకీయ ప్రాధన్యతలో వెనుకబడిన తరగతుల్లోని ఏ గ్రూపులో ఉన్న 24శాతం బీసీ వర్గాలకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆన్యాయమే జరుగుతు న్నదనీ, బీసీ రిజర్వేషన్లో జరుగుతున్న ఆన్యాయాన్ని సరిదిద్దాలని జననాయక్ కర్పూరి టూకూర్ వెల్ఫేర్ ట్రస్టు ప్రతినిధులు రిటైర్డ్ ఎస్.పి దుగ్యాల ఆశోక్, రిటైర్డ్ డీఆర్డీవో అడిషనల్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్ రావు, రిటైర్డ్ అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రావుల పాటి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘం రాష్ట నాయకులు దేవరకొండ సైదులు, బీసీ నాయకులు కోల శ్రీనివాస్ ఆదివారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచా యతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులల్లో ఏ,బి,సి,డి వర్గీకరణ లేకపోవడం వల్ల రాజ్యంగ ఫలాలను బీసీలోని ఏ గ్రూపు ఉన్న సామాజికవర్గం ప్రజలు అందుకోలేకపోతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్యాయానికి గురువుతున్నారని వివరిం చారు. అత్యంత వెనుకబడిన కులాలైన నాయీ బ్రహ్మణ, రజక, వడ్డెర, మేదర, పూసల తదితర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ సామాజిక వర్గాలకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించి ఆర్ధికంగా ముందుకు తీసుకుపోవాలని కోరారు. 80శాతం సబ్సిడీతో రుణాలు ఇప్పించి ఆదుకోవాలని గవర్నర్ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.