Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోషామహల్ డిప్యూటీ కమిషనర్ నాయక్
- రాజకీయ పార్టీల నేతలతో సమావేశం
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
ఓటర్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం. చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని గోషామహల్ డిప్యూటీ కమిషనర్ డిడి నాయక్ తెలిపారు. అబిడ్స్‌లోని ఆయన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఇప్పటికే పేర్లు కలిగి ఉన్నవారు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకు నేందుకు వీలుగా సమర్పించాల్సిన దరఖాస్తు ఫారా లలో ఎన్నికల సంఘం స్వల్ప మార్పులు చేసిందని ఆయన తెలిపారు. ఈ మార్పుల గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యా వ్యవస్థలో ఓటు ఎంతో కీలకమైనదనీ, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తప్పిపోకుండా పేర్లు - నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ స్వచ్ఛందంగా ఆనుసంధానం చేసుకునేలా కృషి చేయాలన్నారు. ఈ విషయంపై విస్తత ప్రచారం నిర్వహించాలనీ, ప్రజలను చైతన్యపరచే కార్యక్రమాలు నిర్వహించాల న్నారు. ఆధార్ అనుసంధానం వల్ల బోగస్ ఓటర్ల బెడతను సులువుగా నివారించవచ్చనీ, జాబితాలో ఓటరు పేరు ఒకచోట ఉంటుందనీ, మరోక - చోట పునరావృతం అయ్యేందుకు అవకాశం ఉండడ న్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఆధారును అనుసంధానం చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రొత్సహించాలన్నారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు దీనికి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్, గోషామాల్ కార్పొరేటర్ లాల్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్, ప్రజా ప్రతిని ధులు, తదితరులు పాల్గొన్నారు.