Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్ నగర్
హైదరాబాద్ నగరం ఈ 8 ఏండ్లలో వైద్య హబ్‌గా మారిందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద గుప్తా అన్నారు. ఆదివారం ఆర్కేపురంలోని నూతనంగా ఏర్పా టు చేసిన మాత హాస్పిటల్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదు నగరం ఎనిమిదేళ్లలో ప్రపంచానికి వైద్యం అందించే స్థాయికి ఎదిగిందన్నారు. కోవిడ్ టీకాలు ప్రపం చానికి ఎగుమతి చేసి కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడటంలో సహాయ పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వళ్ళనే హైదరాబాద్ నగరానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి తెలిపారు. గతంలో మాదిరిగా వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాదులోనే మంచి హాస్పిటల్స్ అభివృద్ధి చెందాయని తెలిపారు. పేద ప్రజలకు నాణ్య మైన వైద్యాన్ని అందించాలని మాత యాజమాన్యా నికి సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్, డాక్టర్లు ధనరాజ్, శ్రీనివాస్, చిలుక ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.