Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను సన్మానించారు. మియాపూర్లో కాపుల ఆత్మ గౌరవ సభ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాపు కుల ప్రముఖులంతా సన్మానించిన శుభాకాంక్షలు తెలిపా రు. రవిచంద్రతో పాటు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు కూడా సభకు హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలో స్థిరపడిన కాపుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చూపుతామని నేతలు హామీనిచ్చారు. ఈ సం దర్భంగా కాపు ఐక్య వేదిక లోగోను అతిథులు ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.