Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఈ నెల 3వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అశోక్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు సీఐటీ యూ జిల్లా నాయకులు కీలుకాని లక్ష్మణ్ పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది, పదిహేను ఏండ్ల నుంచి కాలం చెల్లిన జీవోలను సవరించకపోవడంతో కార్మికులు దోపిడీకి గురవుతున్నార న్నారు. యాజమాన్యాల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికుల హక్కులను కాలు రాస్తున్నారన్నారు. పరిశ్రమల్లో చట్టబద్ధంగా రావాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలను అమలు చేయడం లేదన్నారు. లక్షలాదిమంది కార్మికులు పని చేసు ్తన్న హమాలీ రంగం, ప్రయివేటు ట్రాన్స్పోర్టు రంగంలో పనిచేసే కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయకపో వడం దురదృష్టకరమన్నారు. పెరిగే ధరలకు అనుకూల ంగా జీతాలు నిర్ణయించి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీడిమెట్లలో ఉన్న కెమికల్స్ ఫార్మా, ఇంజినీరింగ్, ఇతర రంగాల యజమాన్యా లు కార్మికుల శ్రమను దోచుకుంటు న్నారనీ, ఈ దోపిడీకి వ్యతిరేకంగా జరిగే చలో హైదరా బాద్ కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పి. అంజయ్య దేవదానం, కరుణాకర్, వీరేశం, ధర్మారెడ్డి, మల్లారెడ్డి, పాషా, సునీల్, సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.