Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలిండియా గిరిజన సమాఖ్య అధ్యక్షులు వెంకన్న నాయక్
నవతెలంగాణ-ముషీరాబాద్
రాష్ట్రంలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆలిండియా గిరిజన సమాఖ్య జాతీయ అధ్యక్షులు వెంకన్న నాయక్ డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గిరిజన ప్రాంతాల్లోని గిరిజనుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని ఆయన కోరారు. బాగ్ లింగంపల్లి సుందర య్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆలిండియా గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం గిరిజన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న నాయక్ మాట్లాడుతూ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జానాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలన్నారు. తండా, గూడెం, గ్రామ పంచాయతీలను గ్రామ రెవెన్యూ పంచాయతీగా గుర్తించి, వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన గిరిజనులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో గిరిజన భవనం, ఐటీడీఏలను ఏర్పాటు చేయాలన్నారు. గిరిజనుల సమరయోధులను గుర్తించి పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో ఆలిండియా గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాఘవన్ నాయక్, ప్రధాన కార్యదర్శి అఖిలేష్ జాదవ్, వర్కింగ్ ప్రెసిండెంట్లు వినాయక్ పవార్, లింగు నాయక్ ఉపాధ్యక్షులు సురేష్ నాయక్ పాల్గొన్నారు.