Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15.25 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ మండల పరిధిలోని ఫతేనగర్‌లో రహస్యంగా గంజాయి విక్రయాలు జరుపుతున్నట్టు సమాచారం మేరకు వివిధ సెంటర్లపై బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 15.25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గరుని అరెస్ట్ చేయగా, మరొకరు పారిపోయారు. ఈ ఘటన బాలానగర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎక్సైజ్ సీఐ డి.వేణుకుమార్ వివరాల ప్రకారం డీపీఈవో విజయాస్కర్ ఆదేశాల మేరకు ఏఈఎస్ మాధవయ్య సూచనలతో బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ఫతేనగర్‌లో రూట్ వాచ్ చేశారు. ఈ సందర్భంగా ఫతేనగర్ ఫ్లైఓవర్ సమీపంలో కాళీవాల విజరు అనుమానాస్పందగా తచ్చాడుతుండగా గమనించిన ఎక్సైజ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోగా అతడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడి ద్విచక్ర వాహనంలో 1.270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా 12.125 కిలోల గంజాయి లభించింది. దీంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజరుతో పాటు అతడి బావ చౌకత్ వాలా అమర్ కుమారును అదుపులోకి తీసుకోగా, విజరు తల్లి కాలివాల మంజు పరారీలో ఉంది. ఇదిలా ఉండగా ఫతేనగర్ పిట్టల బస్తీలోనే మరో గంజాయి విక్రయాలు జరుపుతున్న ఇడ్లీ కవిత ఎక్సైజ్ పోలీసుల కంట పడింది. దీంతో కవిత వద్ద 1,855 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఎస్సైలు శ్యాంసుందర్, రఘు, రష్మిత, సిబ్బంది బాలారాజు, పద్మ, సురేందర్, శ్యాం పాల్గొన్నారు.