Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
గోమాతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అఖిల భారత గో సేవా ఫౌండే షన్ ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌నగర్, టీటీడీ దేవస్థానం నుంచి తిరుపతి వరకు గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 40 మంది సభ్యులు నిర్వహించే మహా పాదయాత్ర ను జెండా ఊపి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, గో ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అన్ని విధాలుగా అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. గోవు ప్రాముఖ్యతను తెలియజేస్తూ జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే డిమాండ్‌తో పాదయాత్ర చేపట్టిన ఫౌండేషన్ చైర్మెన్ బాలకృష్ణ, ఇతర కమిటీ సభ్యులను మంత్రి అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ.లక్ష్మీ నారాయణ, ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.