Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 67115 మంది విద్యార్థులు దరఖాస్తు
- 37 సెంటర్స్‌లో పరీక్షల నిర్వహణ
- పతి ఏడాదీ తగ్గుతున్న దరఖాస్తుల సంఖ్య
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ- 2022 ), ఓయూ, తెలంగాణ, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన లాంటి 6 ట్రెడిషియల్ యూనివర్సిటీలతో పాటు తొలిసారిగా తెలంగాణ మహిళా యూనివర్సిటీ, జేఎన్టీయూ లాంటి మొత్తం 8 విశ్వవిద్యాలయల్లో ఉన్న 50 విభాగాల్లో, 4 విభాగాల్లో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఈ పీజీ ప్రవేశ పరీక్షలు ఈ నెల 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
మూడు షెషన్స్లో.. 37 సెంటర్స్‌లో..
ఈ ప్రవేశ పరీక్షలు ఉదయం 9 -30 నుంచి 11, మధ్యాహ్నం 1 నుంచి 2 -30 వరకు, సాయంత్రం 4-30 నుంచి 6 గంటల వరకు మూడు షెషన్స్ వారిగా నిర్వహించను న్నారు. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు 67115 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అమ్మాయిలు 44,400 మంది, అబ్బాయిలు 22,221 మంది ఉన్నారు. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ నుంచి హాల్‌టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొ.ఐ.పాండు రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటి) విధానంలో నిర్వహించనున్నారు.
5 కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు..
ఇక సీట్ల సంఖ్య కన్నా దరఖాస్తుల సంఖ్య తక్కువుగా వచ్చిన సందర్భంగా అరబిక్, కన్నడ, మరఠా, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో నేరుగా సీట్లు ఎలాట్మెంట్స్ చేయనున్నారు.
తగ్గుతున్న దరఖాస్తులు..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ ఏడాది కూడా పీజీ ప్రవేశాల్లో దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం అధికారులను కలవరపెడుతోంది. గతేడాది కంటే ఈసారి 11 వేల వరకు దరఖాస్తులు తగ్గిపోవడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ ఏడాదిలో సైతం ఒక్క ఓయూలోనే పీజీ ప్రవేశ పరీక్ష కోసం సుమారు లక్షా 50వేల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు 8 యూనివర్సిటీలతో కలిపి 67115 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. ఇంతవరకు ప్రతి ఏడాదీ గణితం, రసాయన శాస్త్రం, వాణిజ్య శాస్త్రం విభాగా ల్లో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ సారి దానికి భిన్నంగా వాటిలో దరఖాస్తు తగ్గి హిస్టీరి, న్యూట్రీషియన్ డైటిక్స్ లాలో దరఖాస్తులు పెరిగాయి. అన్ని యూనివర్సిటీల్లో కలిపి సుమారు 50 వేల పీజీ సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.
సెంటర్స్‌కు అరగంట ముందే చేరుకోవాలి
ప్రతి విద్యార్థి ప్రవేశాల సమయం వరకు విధిగా నూతన ఆదాయ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలి. షెడ్యూల్, సెంటర్స్, ఇతర వివరాలు పూర్తిస్థాయిలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. మరిన్ని వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ను చూడాలి.
- కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి