Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ చంద్రయ్య
నవతెలంగాణ-అంబర్‌పేట
భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని సంబంధిత సిబ్బంది వెంటనే తొలగించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టీస్ చంద్రయ్య ఆదేశించారు. మూసీ వరద ముంపు ప్రాంతాలైన అంబర్‌పేట మండల పరిధిలోని మలక్‌పేట, మూసానగర్, శంకర్‌నగర్ ప్రాంతాల్లో ఆకస్మికంగా సందర్శించారు. వరదలతో నష్టపోయిన నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్ధానిక ప్రజలు వరద కారణంగా తమ ప్రాంతాల్లో పేరుకుపోయిన మురుగు వ్యర్ధాలు తొలగించాలని కోరారు. మూసీ వరద ఇండ్లలోకి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. అనంతరం జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ వరదలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో వెంటనే చెత్తా చెదారాన్ని తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం అంబర్‌పేట మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో మానవ హక్కుల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట మండల రెవెన్యూ అధికారి లలిత, చాదర్‌ఘాట్, అంబర్‌పేట పోలీస్ స్టేషన్ల సర్కిల్ ఇన్స్స్పెక్టర్లతోపాటు సీఐ సుధాకర్, రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ మహేష్‌రాజు, అశ్విన్, బద్రి, గౌడు, ఎస్సైలు మౌనిక, తదితరులు పాల్గొన్నారు.