Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సంద ర్భంగా మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో భాగంగా ''బ్లో ది బెలూన్ ఛాలెంజ్'' నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఒక పెద్ద సైజు బెలూన్ని ఊదాలి.. ఒకవేళ మీరు నోటితో ఒక బెలూన్‌లో గాలినిపడంలో విఫలమైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ''బ్లో ది బెలూన్ ఛాలెంజ్'' లో పాల్గొన్న వారిలో దాదాపుగా 10-20 శాతం మంది మొదటి ప్రయత్నంలో బెలూన్ ఊదలేకపోయారని వారిలో భిన్న వయస్కులు ఉన్నారు. ఒక గాలిబుడగ (బెలూన్) ని పూర్తిగా నోటి గాలితో నింపలేకపోతే ఊపిరితిత్తులు పాడైనట్లేనని అని అంటున్నారు వైద్యులు. అనంతరం డాక్టర్ శరత్ చంద్ర -మెడికల్ అంకాలజిస్ట్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రభావం గురించి అవగాహన పెంచడమే ఈ రోజు ఉద్దేశం అన్నారు. లంగ్ కేన్సర్ ఓ సైలెంట్ కిల్లర్ అనీ, వ్యాధి ముదిరేంత వరకూ ఎలాంటి లక్షణాలు కనిపించవు అనీ, ముదిరిన తర్వాత గుర్తించినా చికిత్సకు లొంగదు అని తెలిపారు. పొగ తాగుట అలవాటు ఉన్నవారికి లంగ్ కేన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ అనీ, 90 శాతం లంగ్ కేన్సర్ కేసులు స్మోకింగ్‌తో సంబంధం ఉన్నవే అనీ, పొగతాగే అలవాటు ఉన్నవారు వెంటనే దాన్ని మానుకోవాలని తెలిపారు. పొగతాగే అలవాటు ఉన్నా, ఇటీవలే మానేసినా ముందు జాగ్రత్తగా ఓసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది అని తెలిపారు. కాలుష్యం వల్ల లంగ్ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయనీ, పారిశ్రామికంగా అలాగే వాహనాల నుంచి వెలువడే కాలుష్యం లంగ్ క్యాన్సర్‌కి దారి తీసే ప్రధాన కారకం అని తెలపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు తలెత్తిన క్యాన్సర్ మరణాల్లో అతిపెద్ద భాగం ఊపిరితిత్తుల క్యాన్సరుదే! అనీ, ఇది ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా 7.6 మిలియన్ల మంది ప్రాణాలను హరిస్తుందని తెలిపారు. రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లన్నింటి ప్రభావం వల్ల మరణించిన వారి కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యే అధికం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు క్యాన్సర్ మరణాల్లో దాదాపుగా ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్లనే అని అంచనా వేయబడిందని తెలిపారు. ధూమపానం చేయని వ్యక్తుల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ సంభవించవచ్చు అనీ, పొగకుకు దూరంగా ఉండి వ్యాధి అభివృద్ధిని నివా రించడానికి పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నివారణ. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయగలిగితే 90 శాతం, రెండో దశలో 70 శాతం వరకూ నయం చేయొచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్ధన్-మెడికల్ అంకాలజిస్ట్, సెంటర్ హెడ్ స్వాప్నిల్ రారు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.