Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతదేశపు మొట్టమొదటి ఆస్పత్రిగా గుర్తింపు అందుకున్న అపోలో హెల్త్ సిటీ
- డాక్టర్ సంగీతారెడ్డిని సత్కరించిన ఐఓ న్యూట్రి హబ్ సీఈవో డాక్టర్ దయాకర్ రావు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీ రోగులకు ఇప్పుడు సూపర్ ఫుడ్ మిల్లెట్‌ను చురుగ్గా అందిస్తున్న భారతదేశంలోని మొట్టమొదటి హాస్పిటల్‌గా గుర్తింపు అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాదులోని జొన్నలు, ఇతర తణధాన్యాలు సంబంధించిన ప్రముఖ పరిశోధనా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐసీఏఆర్-ఐఐఎంఆర్) అపోలో హాస్పిటల్స్‌లో రోగులు తణధాన్యాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి న్యూట్రి హబ్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించినందున ఇది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. న్యూట్రి హబ్ డాక్టర్ బి దయాకర్ రావు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఐఓ న్యూట్రి హబ్ సీఈఓ డాక్టర్ దయాకర్ రావు మాట్లాడుతూ 'పోషకాలతో నిండి ఉండే మిల్లెట్లను ఫైబర్ నాన్-స్టార్చ్ కార్పొహైడ్రేట్లు, ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు, పలు విటమిన్లు, ట్రేస్ ఎలిమెంట్స్, అధిక ఆల్కలిన్, గ్లూటెన్ రహితంగా ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన పోషకాలు అధిక నిష్పత్తిలో ఉన్న కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు, అనేక జీవనశైలి వ్యాధులను అరికట్టడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోగులు త్వరగా కోలుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి వైద్యులు, డైటీషియన్లచే తమ రోగులకు మిల్లెట్లు ఆహారంగా తీసుకోమని తరచుగా సూచిస్తుంటారు. సీనియర్ డైటీషియన్లు న్యూట్రిషనిస్టులు, స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన అపోలో హాస్పిటల్స్‌లోని ఎఫ్ అండ్ బీ టీం విస్తతమైన పరిశోధనలు చేసి, స్థానిక సాంప్రదాయ దక్షిణ భారత, ఉత్తరభారతానికి సంబంధించిన పలు రుచికరమైన మిల్లెట్ వంటకాలను రూపొందించింది. మన పూర్వీకులు మాదిరిగానే దీనిని ప్రధాన ఆహారంగా ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ఈ పరిశోధన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు' అని ఆయన వివిరంచారు. తెలంగాణ రీజినల్ సీఈవో అపోలో హాస్పిటల్స్ వై సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో మిల్లెట్ ఆధారిత వంటకాల కోసం ప్రత్యేకమైన మొదటి క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేశామని అన్నారు. 'ఈ క్లౌడ్ కిచెన్ భారత దేశంలో అత్యుత్తమ క్లౌడ్ కిచెన్‌గా కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఐసీఎం ఆర్ అవార్డు పొందింది. ఈ క్లౌడ్ కిచెన్ మిల్లెట్ల ఆధారంగా అన్ని స్థానిక సాంప్రదాయ దక్షిణ భారత, ఉత్తర భారతీయ వంటకాలను అందిస్తుంది. అపోలో హాస్పిటల్ రైతుల నుండి నేరుగా తణధాన్యాలను సేకరించినందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. దీని వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రైతుల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. దీనికితోడు ఆస్పత్రికి ధాన్యం సరఫరాకు అంకితభావంతో కూడిన వనరు అనేది అందుబాటులో ఉంటుంది. మిల్లెట్ సాగు, వినియోగం పర్యావరణ, ఆరోగ్య దుక్కోణం నుంచి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగిస్తుంది. తణధాన్యాలను పండించడం అనేది పర్యావరణ అనుకూలమైనది. వాటిని పండించడానికి వర్షపు నీరు సరిపోతుంది. అవి మన నీటి వనులను ఖాళీ చేయవు. మట్టిని కలుషితం చేయవు. తణ ధాన్యాలు సేంద్రియమైనవి. ఎందుకంటే వాటి సాగుకు రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. అవి రైతు స్నేహపూర్వకమైనవి. సాగు చేయడానికి, గణనీయమైన లాభాలను ఆర్జించటానికి చౌకైనవి. అన్నింటికి మించి అవి చాలా ఆరోగ్యకరమైనవి. ప్రస్తుత తరం బాధపడుతున్న అనేక జీవనశైలి వ్యాధులకు దివ్య ఔషధం వంటివి. అపోలో హాస్పిటల్స్ అన్నింటిలో సూపర్ ఫుడ్ మిల్లెట్ డైట్‌ని పేషంట్లలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తుంది. మిల్లెట్ వంటకాలతో ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఉప్మా, పొంగల్ మసాలా వడ, ఉల్లిపాయ రింగ్స్ ,పునుగులు, బోండా బజ్జీలు, తయారు చేస్తున్నాం' అని చెప్పారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎరుకలపాటి, కార్డియాలజిస్ట్, నటుడు డాక్టర్ భరత్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ హరిత శ్యామల పాల్గొన్నారు.