Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని దొరకక ఖాళీ కడుపుతో పడిగాపులు
- ముసురుతో ఉపాధికి దెబ్బ
- వారం రోజులు పని దొరకక కూలీలు లేబర్ అడ్డాలపై నిరీక్షణ
- అడ్డాలపై వేలాదిమంది కార్మికులు ఉండగా పని దొరికేది కేవలం కొంతమందికే
నవతెలంగాణ-అడిక్మెట్
వర్షాకాలం వచ్చిందంటే చాలు అడ్డా కూలీల బతుకులు ఆగమవుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన అడ్డా మీద లేబర్ ఉపాధికి గండి కొడుతుంది వర్షాలతో భవన నిర్మాణ పనులు సక్రమంగా జరగకపోవడంతో వలస కూలీలకు పని దొరకడం లేదు రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడ్డాయి. పల్లెల్లో వ్యవసాయ పనులు లేక చాలామంది కూలీలు కూలీ పనులు దొరుకుతాయని తపనతో చాలా మంది పట్నం వస్తుంటారు. చిన్న చిన్న ఇరుకు గదులను అద్దెలకు తీసుకుని కుటుంబంతో సహా వలస వస్తు జీవిస్తుంటారు అటువంటి కూలీలు నమ్ము కుని వచ్చిన పట్నంలో పని దొరకక ఖాళీ కడుపుతో కాలం ఎల్లదిస్తున్నారు
ముషీరాబాద్ నియోజక వర్గంలో అతిపెద్ద లేబర్ అడ్డాలు ఇప్పుడు వర్షాల వలన పని దొరకక పడిగాపులు కాస్తున్న అడ్డా కూలీలతో దర్శన మిస్తున్నాయి. నియోజకవర్గంలోని వందలాది కుటుం బాలు లేబర్ అడ్డాని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు ప్రతిరోజు పని దొరుకుతుంది అన్న ఆశతో ఆలుమగల్లు ఉదయం నుంచే పరుగు పరుగున లేబర్ అడ్డాలకు చేరుకుంటున్నారు మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసి పని దొరకక నిరాశతో వెను తిరుగుతున్నారు. మహిళా కూలీలు సైతం లేబర్ అడ్డాలపై పడిగాపులు కాస్తు జీవితం వెళ్లదీస్తున్నారు. పని దొరికితే సంతోషంగా కష్టపడుతూ నాలుగు మెతుకులతో కడుపు నింపుకుంటున్నారు అటువంటి అడ్డా కూలీల బతుకులపై వరుణ దేవుడు కనికరం చూపడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన భవన నిర్మాణ రంగం కుదైలైంది వర్షాలకు పనులు సాగకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఇసుక ఇటుక కొరతతో ఏడాదిలో సగం రోజులు పని దొరకకపోవడం వర్షాలతో ఉన్న కాస్తిని రోజులు కూడా వర్షార్పణం అవడంతో కూలీలు దిక్కు చోతని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. అసలే మాయదారి రోగం కరోనా కాటుకు చిన్నాభిన్నం అయిన కార్మిక కుటుంబాలు ఇకనైనా తమ బతుకులు మారుతాయని ఆశతో ఉంటే వరుణుడు వారి ఆశలపై నీళ్లు జల్లాడు. తమ బతుకులు మారవా ఇక అని నిరాశ చెందే పరిస్థితులు ఎదురయ్యాయి. ఇకనైనా భవన నిర్మాణదారులు అడ్డా కూలీలపై కనికరం చూపిస్తూ కనీసం నెలలో సగం దినాలైనా పని కల్పించే విధంగా వారిని ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
నిత్యవసర సరుకుల ధరల భారం
పుట్టెడు కష్టాలతో ఒకపూట భోజనం కొరకు నాన్న అవస్థలు పడుతూ కాలం ఎల్లతీస్తున్న కార్మికులపై నిత్యవసర ధరల పెరుగుదల మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ రీతిలో తయారయింది ధరలు ఆకాశాన్ని అంటడంతో ఏది కొనేటట్టు లేదు ఏది తినేటట్టు లేకుండా పోయింది ధరల పెరుగుదల భారంతో అడ్డా కూలీలు కార్మికులు పచ్చడి మెతుకులతో కాలం ఎలతీస్తున్నారు.