Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 3న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
- సీఐటీయూ ముషీరాబాద్ జోన్ కార్యదర్శి జి రాములు
నవతెలంగాణ-ముషీరాబాద్
73వ షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాలజీవోలను సవరించాలని సీఐటీయూ ముషీరాబాద్ జోన్ కార్యదర్శి జి రాములు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 3న ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం సీఐటీయూ నగర కార్యాలయంలో మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో కనీస వేతనాలు చట్టం పరిధిలో 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయని వీటిలో సుమారు కోటి మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎనిమిదేండ్లు గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను సవరించలేదన్నారు. కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్లో ఐదు జీవోలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ జీవోలను ఇప్పటివరకు గెజిట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జీవులను గెజిట్ చేసి మిగిలిన 68 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాలు జీవులను సవరించాలన్నారు బీడీ హమాలీ భవన నిర్మాణం ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులతో పాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె రమేష్, కుమార్, వెంకటయ్య, పెద్దయ్య, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.