Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని సీపీఐ(ఎం) అబ్దుల్లా పూర్మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ మాట్లాడుతూ... మండలంలోని తట్టి అన్నారం గ్రామ రెవెన్యూ సర్వే నెం. 127/2,127/3లోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యాపారులు కబ్జా చేస్తున్నారని తెలిపారు. ఇదే సర్వే నెంబర్లో గతంలో సర్వే చేపట్టి ప్రభుత్వ భూమిని వెలికి తీసి హద్దురాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. విలువైన భూములు కావడంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకు పాల్పడు తున్నారని, అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. ఈ విషయమై అనేకసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. రెవెన్యూ అధికారులు భూమిని రక్షించే ప్రయత్నం చేస్తుంటే వారిని కూడా బెదిరించి అక్రమా లకు పాల్పడుతున్నారని చెప్పారు. అక్రమార్కుల నుంచి ప్రభుత్వ భూమిని రక్షించి ఇండ్లు లేని నిరుపేదలకు నివాస స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులతో పాటు బీఎస్పీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రభాకర్, స్థానిక నాయకులు సుక్క రవి, మునిందర్ రెడ్డి, సర్వయ్య, సుధాకర్, మల్లయ్య, సౌజన్య, మంజుల, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.