Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
నాచారం బాబానగర్ దుర్గా నగర్లో నూతన డ్రయినేజీ నాలా కోసం పనులు చేపట్టారు. ఆ పనులను సత్వరమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనీ, నిర్లక్ష్యం కనబరుస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ నాచారం సమితి ఆధ్వర్యంలో సోమవారం కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఉప్పల్ మండల సహాయ కార్యదర్శి ధర్మేంద్ర, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఉప్పల్ మండల అధ్యక్షురాలు కె.సుగుణ మాట్లాడారు. మాట్లాడుతూ రెండు వారాలు గడుస్తున్నా నాలా పనులు పూర్తి చేయకుండా అధికారులు, కాంట్రాక్టర్ అలసత్వం వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలం వల్ల ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, పూర్తి చేయకుండా వదిలేసిన డ్రయినేజీ నాలా వల్ల మరింత ప్రమాద ఘంటికలు ఏర్పడే ప్రమాదముందని తెలిపారు 8 ఫీట్ల తవ్వకాల గుంతలు భయాన్ని కలిగిస్తున్నాయనీ, ఒకవైపు ప్రభుత్వ పాఠశాల మరో వైపు స్మశానవాటిక ఉన్నదనీ, ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాధమున్నదని తెలిపారు. తవ్విన నాలా నుంచి దుర్గంధం వస్తున్నదనీ, దుర్గంధం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనీ, కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మితమౌతున్న నాలా పనుల జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌ను తొలగించి, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు షబానా, రజినీ, సద్దాం, తదితరులు పాల్గొన్నారు.