Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపాలిటీలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. ఘట్కేసర్ మున్సిపల్ కార్యాలయంలో సోమ వారం కులపెద్దలతో చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముళ్లిపావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీలో ప్రతి ఏటా నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా సోమ వారం మున్సిపల్ కార్యాలయంలో గ్రామ పెద్దలతో కుల సంఘాలు నాయకులతో ఏర్పాటు చేసుకున్న సమావేశం లో అందరూ కలిసి ఏకతాటిగా ఈనెల 14వ తేదీన ఘట్కేసర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరుపు కునేందుకు నిశ్చయించారు.
కావున మున్సిపాలిటీ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని, అదేవిధంగా అమ్మవారి ఆలయాలకు కావలసిన లైటింగ్స్, మైక్‌లు, సీరియల్ బుల్బ్స్ అన్ని కూడా మున్సిపాలిటీ నుండి ఏర్పాటు చేస్తామని, ఆలయాల ఆవరణలో మట్టి పోయించి సుందరీకరణ చేసేందుకు కషిచేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చూడటం మన అందరి బాధ్యత అని, ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఘట్కేసర్ మున్సిపల్ వైస్‌చైర్మెన్ పలుగుల మాధవరెడి,్డ మాజీ ఎంపీపీ బండారి దాసు, గట్టు మైసమ్మ దేవాలయ చైర్మెన్ చిత్తారి యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్‌రెడ్డి, బండారి ఆంజనేయులుగౌడ్, కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి, కడు పొల్ల మల్లేష్, బత్తుల నరేష్ యాదవ్, బేతల నర్సింగ్‌రావు, కుతాది రవీందర్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకష్ణ ముదిరాజ్, వివిధ కుల సంఘాల పెద్దలు గ్యార బాలయ్య, శేఖర్, బర్ల ఆంజనేయులు, అబ్బసాని ఆంజనే యులు యాదవ్, కేశవపట్నం ఆంజనేయులు, చాకలి నారాయణ, నరేష్, రామయ్య, బలరాం, ఆనంద్, పవన్ ్చారి, నర్సింహచారి, లగ్గోని మధు, మడిపడిగే శంకర్, పల్లె విజరుగౌడ్, ఆనంద్, రహీం, జగదీష్ పాల్గొన్నారు.