Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్.సబిత
నవతెలంగాణ-ఘట్కేేసర్
అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఆరుగాలం శ్రమిస్తున్న రవాణారంగ కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డ్ సాధన కోసం ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమానికి ట్రాన్స్పోర్ట్ కార్మికులు తరలిరావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్.సబిత పిలుపునిచ్చారు.
సోమవారం తెలంగాణ పబ్లిక్రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీిఐటీయు) ఘట్కేసర్ మండల కేంద్రంలో శ్రీ గట్టు మైసమ్మ తల్లి గూడ్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆమె రవాణారంగ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 3వ తేదీన చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలన్నారు. రవాణా రంగం కార్మికులకు కనీస వేతనాల జీవో నెంబర్ 25 గెజిట్ చేయాలన్నారు. రాష్ట్రంలో సుమారు 20లక్షల మంది స్వయం ఉపాధి మీద ఆధారపడి పనిచేస్తున్న రవాణారంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 25 గెజిట్‌గా మార్చి అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో క్యాబ్, ట్రాలీ, ట్రాక్టర్, జీపు, ట్రక్కు, స్కూల్ బస్సు, అంబులెన్స్, డీసీఎం మినీ డీసీఎం డ్రైవర్స్, క్లీనర్స్ పాల్గొనాలని ఆమె కోరారు. చదువుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్సులు, బ్యాంకుల నుండి అప్పు తీసుకొని, వాహనాలు కొనుగోలు చేసి స్వయం ఉపాధి మీద ఆధారపడి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగ కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ పని గంటలు, పని భద్రత లేదన్నారు. కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ, ప్రజా సేవ చేస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఉన్న మాదిరిగా, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజికంగా, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, పోలీస్ మరియు ఇతర అధికారుల వేధింపులు ఆపాలని, పెరిగిన ఫిట్నెస్, ఇన్సూరెన్స్ టాక్సీ లైసెన్స్ రెన్యువల్ ఛార్జీలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు .కనీస వేతనాల పెంపుపై ఐదు రంగాలకు ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్స్‌కు గెజిట్ ఇవ్వాలి, 73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించి కనీస వేతనం రూ.26వేల రూ.లు నిర్ణయించి ఇవ్వాలన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమానికి రవాణా కార్మికులు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ మరియు అనంతరం జరిగిన సమావేశంలో యూనియన్ అధ్యక్షులు చెరుకు శ్రీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కడమంచి యాదగిరి, బూడిద స్వామి, ఎం.దశరథ, జి.హనుమంత్, జి.వెంకటయ్య, వై.నర్సింగ్‌రావు, జి.రామాంజనేయులు, జి.జయంత్ రెడ్డి, యాకాంత పాల్గొన్నారు.