Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య
- ఈనెల 3న పార్లమెంట్ వద్ద ధర్నా
నవతెలంగాణ-అడిక్‌మెట్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌కు అనుకూలంగా తీసుకువస్తున్న అటవీ సంరక్షణ నియమాలు 2022 వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. అటవీ ప్రాంత ప్రజల హక్కులు కాలరాస్తూ తెచ్చిన నియమావళికి వ్యతిరేకంగా ఆగస్టు 3న పార్లమెంట్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సోమవారం విద్యానగర్‌లోని మార్క్స్ భవన్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లు, ఎంఎన్సీలకు అటవీ భూములు, ఖనిజ సంపదను దారాదత్తం చేయటానికే కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ నియమాలు 2022 తీసుకువస్తుందని ఆరోపించారు. అటవీ సంరక్షణ నియమాల సవరణలు ఆదివాసుల షెడ్యూల్డు ప్రాంతాల చట్టాలు, అటవీ హక్కుల చట్టం 2006ల ద్వారా గ్రామ సభలు, అటవీ ప్రాంత ప్రజల అటవీ భూముల హక్కులను కాలరాస్తాయని తీవ్రంగా విమర్శించారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి. కోటేశ్వర రావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు జి. ఝాన్సీ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. శ్యాం తదితరులు పాల్గొన్నారు.