Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 250 పట్టాలు, 55 గోల్డ్ మెడల్స్ ప్రదానం
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి. రమణకు గౌరవ డాక్టరేట్ అందజేయనున్న ఓయూ
- చాన్సలర్ హోదాలో గవర్నర్, ముఖ్య అతిథిగా
- చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి. రమణ హాజరు
నవతెలంగాణ-ఓయూ
ఆగస్టు 5న 82వ స్నాతకోత్సవ నిర్వహణకు ఉస్మానియా యూనివర్శిటీ సిద్ధమవుతోంది. ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు నిర్వహించే పట్టాల ప్రదానోత్సవ కార్యక్రమానికి చాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తోపాటు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ హాజరుకానున్నారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం 5గంటలకు జరిగే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఓయూ ఎగ్జామినేషన్ డిపార్టుమెంట్ కంట్రోలర్ ప్రొ.బి.శ్రీనగేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
250 మందికి పట్టాలు, 55 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం
ఓయూ స్నాతకోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న సుమారు 250 వివిధ కోర్సుల్లో పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఇక 55 మంది టాపర్స్‌కు గోల్డ్ మెడల్స్ అందజేస్తారు. ఈ వేదిక మీద కేవలం పీజీకి సంబంధించిన గోల్డ్ మెడల్స్ మాత్రమే ప్రదానం చేస్తారు. యూజీకి సంబంధించిన 11 గోల్డ్ మెడల్స్‌ను ఆయా కళాశాలకు నేరుగా పంపించనున్నారు.
గోల్డ్ మెడల్స్ స్వీకరించనున్న వారు ముందస్తుగా ఓయూ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారి వెంట స్నాతక్సోవానికి రావడానికి కేవలం ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. సదరు అభ్యర్థికి మాత్రమే పట్టాలు, గోల్డ్ మెడల్స్ ఇస్తారు. ఈనెల 4న పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందుకునే వారికి ప్రత్యేకంగా పాసులు జారీ చేయనున్నారు. పాస్‌పై ముద్రించిన సీటు నెంబర్లోనే సదరు అభ్యర్థి కూర్చోవాల్సి ఉంటుంది. పట్టాలు, మెడల్స్ అందుకునేవారు ఒక గంట ముందుగానే వేదికవద్దకు చేరుకోవాలి. అంతేగాక వీరు తమ ఇన్విటేషన్ కార్డుతోపాటు స్నాతకోత్సవ సంప్రదాయ తెల్లని దుస్తులతోపాటు మాస్క్ ధరించి హాజరు కావాలని ఓయూ అధికారులు పేర్కొన్నారు.
21 ఏండ్ల తర్వాత ఎన్.వి. రమణకు డాక్టరేట్
చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా ఎన్.వి. రమణకు 21 ఏండ్ల తర్వాత స్నాతక్సో వంలో గౌరవ డాక్టరేట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ ప్రదానం చేయనుంది. ఓయూలో చివరిసారిగా 2001 సంవత్సరంలో ప్రముఖ భారత-అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ అరుణ్ నేత్రావలికి డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలుగా ఎవరికీ డాక్టరేట్ ఇవ్వలేదు. 105 ఏండ్ల ఓయూ చరిత్రలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించగా ఇప్పటివరకు 47 మందికి గౌరవ డాక్టరేట్స్ ప్రదానం చేశారు. ఓయూ డాక్టరేట్స్ అందుకున్న వారు ఆయా రంగాల్లో ప్రముఖు స్థానంలో ఉన్నారు.