Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్స్ తాత్కలికగా ఉద్యోగుల నిరసన
నవతెలంగాణ-బంజారాహిల్స్
పెంచిన వేతనాలు చెల్లించాలని నిమ్స్ ఆస్పత్రి తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్ చేశారు. పెంచిన వేతనాలు ఇవ్వడం లేదని సోమవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. పెంచిన వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన యజమాన్యం చేతులెత్తేసిందని, తమకు స్పష్టమైన నిర్ణయం తెలిపే వరకు విధులు నిర్వహించబోమని స్పష్టం చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ అమెరికా పర్యటనలో ఉన్నారని, వచ్చాక లిఖితపూర్వకమైన హామీ ఇస్తామని యాజమాన్యం తరఫున ప్రతినిధులు తెలియజేయడంతో తాత్కాలికంగా నిరసనను ఉపసంహ రించుకున్నారు.