Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రజలు వైజ్ఞానిక శాస్త్ర దృక్పథంతో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని రాజ్యాంగ స్ఫూర్తిని విస్తృతంగా ప్రచారం చేసిన మహానీయుడు డాక్టర్ పీఎం భార్గవ అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ పీఎం భార్గవ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. సీసీఎంబీ సైంటిస్ట్ డాక్టర్ చందన చక్రవర్తి, మానవ వికాస వేదిక జాతీయ అధ్యక్షులు బి సాంబశివరావు హాజయ్యారు. ఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ మాట్లాడుతూ సైన్స్ రంగం అభివద్ధికి డాక్టర్ పీఎం భార్గవ ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ప్రజలకు సైంటిఫిక్ కోణాన్ని అవగాహన చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. డాక్టర్ చందన చక్రవర్తి మాట్లాడుతూ హైదరాబాదులో సీసీఎంబీ ఏర్పాటు చేయడంలో డాక్టర్ భార్గవ మూలకారకుడు అన్నారు. కార్యక్రమంలో కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ వహీద్, నాయకురాలు గుత్తా జ్యోత్స్న, టీపీఎస్కే కన్వీనర్ వెంకటేశ్వర్లు, ఇండియా సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్, అమ్మ శరీర నేత్రదానం ప్రోత్సాహక సంఘం అధ్యక్షులు గంజి ఈశ్వరయ్య, విజ్ఞాన దర్శిని నాయకురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.