Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్/ధూల్‌పేట్
కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు అశోక్, శ్రీనగర్ కాలనీ మార్బుల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీనగర్ కాలనీలో మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, సత్యనారాయణ, కేశవులు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దోబిఘాట్ లేబర్ అడ్డా వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జోగు యాదయ్య, బీర్ల, శ్రీను, జె. లక్షణ్, ప్రభు, వీరాస్వామి, జె.జంగయ్య, లక్ష్మమ్మ, దేవమ్మ, సోనీ తదితరులు పాల్గొన్నారు.