Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్ధ్ ముదిరాజ్
నవతెలంగాణ-అంబర్పేట
మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఈనెల 5న చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్ధ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి వెంకటరమణ మాదిగతో కలిసి చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరారు. రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగారావు, వంజరి రాజు, మధు, తాళ్లపల్లి శేఖర్ పాల్గొన్నారు.