Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ విజయ రెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
విద్యతో సమాజ నిర్మాణాన్ని సులువుగా నేర్పించవచ్చని ఖైరతాబాద్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకురాలు విజయ రెడ్డి అన్నారు. మంగళవారం పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ గవర్నమెంట్ హైస్కూల్ (ఫిలింనగర్)లో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, స్థానిక నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.