Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభలో బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాశాల వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌పై మంగళవారం సెమినార్ నిర్వహించారు. మొట్టమొదటిసారి ఈ సెమినార్లో దుర్గాబాయి దేశ్ముఖ్్ వ్యక్తిగత జీవితం, సంఘసంస్కర్త, స్త్రీ సాధికారత, స్వాతంత్రోద్యమర తదితర అంశాలపై ప్రసంగించారు. కళాశాల అనుబంధ సంస్థలైన డీడీఏఎంఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, రామచంద్ర గర్ల్స్ హైస్కూల్, లా కాలేజ్, నర్సింగ్ కాలేజ్ సంస్థల నుంచి అనేక మంది ఈ సెమినార్లో పేపర్స్‌ను సమర్పించారు. ఈ సెమినార్ కళాశాల చైర్పర్సన్ ప్రొఫెసర్ సులోచన ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి, కళాశాల కార్యదర్శి డాక్టర్ ఎం వాణి, ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ జి. ఇందిరా తదితరులు పాల్గొన్నారు.