Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ములుగులో లాయర్ మల్లారెడ్డి దారుణ హత్యకు నిరసనగా మంగళవారం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస చారి అధ్యక్షతన న్యాయవాదులు విధులను బహిష్కరించి నిర సన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ములుగు. లాయర్ మల్లారెడ్డి హత్యని ఖండిస్తూ నల్లబాడ్జిలు ధరించి నినా దాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివా సచారితో పాటు న్యాయవాదులు మాట్లాడుతూ తక్షణమే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పదేపదే న్యాయవాదులపై ఇలాంటి ఘటనలు పునావృత్తం అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే బాధిత న్యాయవాది కుటుంబానికి న్యాయం చేయాలనీ, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ బార్ అసోసియే షన్ ఉపాధ్యక్షురాలు జి.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి మంద మురళి, జాయింట్ సెక్రెటరీ సబావత్ బాల్య నాయక్, గ్రంథాలయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కోశాదికారి కూరాకుల మురళీ మోహన్, క్రీడలు సాంస్కతిక కార్యదర్శి డీఈ గణేష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఉమ్మగాని రాజ్ కుమార్, సతీష్ పెర్ల పితిరుపతి, ఎం.వంశీ కిరణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
దుండగులను కఠినంగా శిక్షించాలి
కాప్రా : సీనియర్ న్యాయవాది మల్లారెడ్డిని వరంగల్‌లో అతి దారుణంగా హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనీ, న్యాయవాదుల రక్షణా చట్టాన్ని అమలు చేయాలని జ్యూరీస్ లా అసోసియేషన్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది కె.ధర్మేంద్ర కోరారు. న్యాయవాది హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రశ్నించే గొంతుకలకే రక్షణ కొరవడిన ఈ తరుణంలో న్యాయవాదుల రక్షణకు ఉన్న అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.