Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాలల జేఏసీ జాతీయ అధ్యక్షుడు ఆళ్లపల్లె రవి, రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యం కోసం దళితులు అభివద్ధి చెందకుండా అణగదొక్కేందుకు కుట్రపన్నుతున్నారని మాలల జేఏసీ జాతీయ అధ్యక్షుడు ఆళ్లపల్లె రవి, రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 10 నుంచి 12 వరకు ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియజేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై విభజనకు కుట్ర చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. దళితులు తమ హక్కులు సాధించుకునేంతవరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదు అని, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలుకుతామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో దళితులు ఐక్యమత్యంతో తమ సత్తా చాటుతామన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నా నిరసనలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో
డాక్టర్ చిక్కుడు గుండాలు, శ్యాం కుమార్, బిందెల యాగలక్ష్మి, కోతి ఇందిరా, బొల్ల మల్ల నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.