Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-అంబర్పేట
లోప్రెషర్ నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. అంబర్పేట డివిజన్ అనంతరామ్నగర్ కాలనీలో నాలుగైదు రోజుల నుంచి లో ప్రెషర్ మంచినీటి సమస్య ఉందని స్థానికులు కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన స్థానిక అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా కషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ కుషాల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబోల్ నరసింహారెడ్డి, రమేష్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.