Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన జయేష్ రంజన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంతర్జాతీయంగా డిజిటల్, టెక్నాలజీ కన్సల్టెంట్ సేవల కంపెనీ క్రిటికల్ రివర్ కేంద్రాన్ని, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్నోషన్ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్టు వెల్లడించింది. దేశంలో సంస్ధకు ఇది మూడో కేంద్రం. ఈ నూతన సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్నోవేషన్, పలు రంగాల వ్యాప్తంగా క్రిటికల్ రివర్ వినియోగదారులు భావితరపు డిజిటల్ సాంకేతికతలను స్వీకరించడానికి నేతృత్వం వహించడంతో పాటు కమ్యూనిటీపై సానుకూల సాంకేతిక ప్రభావాన్ని సైతం తీసుకురానుంది. ప్రారంభోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఐఅండ్‌సీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ మాట్లాడుతూ 'భావి తరపు సాంకేతికతల్లో ఆవిష్కరణలకు మద్దతునందించేందుకు క్రిటికల్ రివర్ లోతైన నిబద్ధత పట్ల సంతోషంగా ఉన్నాం. ఈ సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్నోవేషన్ కేవలం వ్యాపార కార్యకలాపాలపై మాత్రమే కాదు, హైదరాబాద్ నగరంలో ఉద్యోగావకాశాలు పెంచడం, స్ధానిక భాగస్వాముల పర్యావరణ వ్యవస్ధపై నిర్మాణం, అంతర్జాతీయ పెట్టుబడి సమాజంపై సానుకూల ప్రభావాన్ని సైతం ఇది తీసుకురావడం ద్వారా తన ప్రభావాన్ని చూపనుంది' అని వారు తెలిపారు.