Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సీపీిఐ(ఎం) జిల్లా సభ్యులు కీసర నర్సిరెడ్డి ఆలేటీ ఎల్లయ్య అన్నారు. వారోత్సవాలు గోడపత్రికను వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పార్కులో విడుదల చేశారు. ఈనెల 17వ తేదీన ఆరుట్ల గ్రామం, మంచాల మండలంలో ముగుస్తుం దన్నారు. అట్టి ముగింపు బహిరంగ సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరై ముగింపు ఉపన్యాసం ఇస్తారని అన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ఎక్కడికక్కడ ఈ బైక్ ర్యాలీలో పాల్గొని బహిరంగ సభలను, బైక్ ర్యాలీలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎల్బీ నగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, లాట్లక్ష్మణ్, ప్రభాకర్, నగేష్, భాగ్యమ్మ, ఉపేందర్, శ్రీశైలం, మైసమ్మ, సత్యనారాయణ రాజు, ఆంజనేయులు, సత్తయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.