Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
గురువులు మార్గ నిర్దేశకులని, విద్యార్థిలోని ప్రతిభను గమనించి ప్రోత్సహించేవారే నిజమైన గురువులు అని ప్రముఖులు పేర్కొన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఎ.బి.సి ఫౌండేషన్ అధ్యర్యంలో గురువందనం పేరిట పురస్కార ప్రదానం, హమార భారత్ పేరిట నత్య సంగీత ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిóగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్, కేంద్ర పూర్వ మంత్రి డాక్టర్ ఎస్.వేణుగోపాలచారి పాల్గొని నాట్య సంగీత గురువులను సత్కరించి మాట్లాడారు. అకాడమిక్ విద్య నేర్పటం వేరు కళా ప్రక్రియల్లో శిక్షణ ఇవ్వటం వేరని అన్నారు. ఒక గొప్ప కళాకారుణ్ణి తయారుచెయ్యటం తపస్సు వంటిదని వారు అభివర్ణించారు. ఎ.బి.సి ఫౌండేషన్, కళారంగంలో చేస్తున్న సేవలు ఆభినందనీయమన్నారు. కె.వీ.రమణారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తమ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులకు వేదిక కల్పిస్తున్నామని తెలిపారు. లలితారావు స్వాగతం పలికిన సభలో రేడియో జాకీ వేణు, సినీ నటులు ఊర్వశి పటేల్, ప్రణరు, నాట్య గురువులు సంపత్, రంగాచార్యులు, మనోహర్, విజయలక్ష్మ్షి తదితరులను సత్కరించారు.