Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కమలానగర్ ఆఫీసులో తెలంగాణ సాయుధ పోరాట, సాంస్కతిక వికా సం అనే అంశంపై సెమినార్ నిర్వహించడం నిర్వహిం చారు. సెమినార్ ప్రారంభ సూచికగా వీరనారి ఐలమ్మ ఫోటోలకు ప్రముఖ రచయిత పి.బి చారి, శ్రీమన్నారాయణ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సెమినారుకు ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత పిబి చారి ప్రసంగిం చారు. వీరనారి ఐలమ్మ నిజాం సర్కారు దుర్మార్గాలకు, వారి తాబేదారులైన దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి దుష్టత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత అన్నారు. అప్పటికే సంఘ సభ్యురాలుగా ఉన్న ఐలమ్మ గొప్ప పోరా టాలు చేశారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమయ్యారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం సాంస్కతిక వికాసానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆ పోరాటం నుంచి అనేక కవులు, రచయితలు ఉద్భవించారన్నారన్నారు. అనేక రకాల సాహిత్యం వికసించిందని చెప్పారు. ప్రజల భాష ప్రజల యాసలు అద్భుతంగా రాణించాయని చెప్పారు. కోమటి రవి మాట్లా డుతూ ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తి నేటి పాలకులు మత ఘర్షణ రూపంగా చిత్రీకరిస్తున్నారనీ, అదంతా సరికాదన్నారు. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకమైన పోరాటం అన్నారు. సాంస్కతిక రంగంలో అదెన్నో అద్భుతాలు సృష్టిం చిందని చెప్పారు. అధ్యక్షత వహించిన గొడుగు యాదగిరి రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం అనేక మంది కవులను కళాకారులను సృష్టించిందన్నారు. దాశరధి కృష్ణమాచారి, దాశరధి రంగాచారి, వొట్టికోట ఆల్వార్ స్వామి, కాళోజీ నారాయణరావు లాంటి ఉద్దండులను తీసు కొచ్చిందని చెప్పారు. గొల్ల సుద్దులు, నాటికలు, నాటకాలు పాటలు జనాలను ఉర్రూతలూగించాయన్నారు. అనం తరం సభ్యులందరూ ఐలమ్మ చిత్రపటానికి పూలు అర్పిం చి, నినాదాలు చేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వెంకట్, జి.శివరామకృష్ణ, ఆర్ఎస్ఆర్ ప్రసాద్, నర్సింగ రావు నాగయ్య, నర్సయ్య, సోమయాచారి, రుక్కయ్య, వెంకటేష్, బ్యాగరి వెంకటేష్, శ్రీనివాసరావు, గణేష్, ప్రేమలతారెడ్డి, నిర్మల, బాసిన్, గౌసియా పాల్గొన్నారు.