Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి. నర్సింహారావు
- ఐలమ్మ 37 వర్ధంతి సందర్భంగా నివాళి
- పలుచోట్ల ఐలమ్మ వర్ధంతి సభలు, నివాళులు
- కృష్ణకాంత్ పార్కువద్ద ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాళి
- నవతెలంగాణ-బాలానగర్/ధూల్‌పేట్/కుత్బుల్లాపూర్/ జూబ్లీహిల్స్్/సికింద్రాబాద్
నిరంకుశత్వాన్ని ఎదురించిన ధీశాలి ఐలమ్మ అని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు అన్నారు. శనివారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బాలానగర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సభను నిర్వహించారు. డీజీ నర్సింహారావుతోపాటు సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం, తదితరులు ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ చేపట్టిన భూ వివాదంలో ఓటమి పాలైన దేశ్‌ముఖ్ ఇసునూరు రామచంద్రారెడ్డి పాలకుర్తిపై అనేకసార్లు దాడులు జరిపించాడని, దొర పోలీసులతో ఐలమ్మ ఇంటికొచ్చి కమ్యూనిస్టులకు ఎందుకు సాయం చేస్తున్నావని ప్రశ్నించినా ఐలమ్మ ఏమాత్రం బెదరకుండా రోకలి బండను అందుకోవడంతో దొర తోక ముడిచిన వైనాన్ని గుర్తు చేశారు. నైజాం తొత్తు, మధ్య యుగాల భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధి, నరరూప రాక్షసుడైన విసునూరు దేశముఖ్‌ను ఎదిరించిన మట్టి మనిషి వీరనారి ఐలమ్మ అన్నారు. నాడు ' నీ కాళ్లు మొక్తా దొరా.. నీ బాంచెన్ దొరా ' అన్న రైతు కూలీ బిడ్డలే దొరలకు వ్యతిరేకంగా గుత్పలు, వడిసెలు, తుపాకులతో తిరగబడ్డారన్నారు. ఐలమ్మ ఆ మహత్తర తిరుగు బాటుకు స్ఫూర్తి సంకేతమై ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పట్టి పోరాడిందన్నారు. పంటను, భూమిని దక్కించుకుని దొరల నెదిరిస్తే కష్టాలు తప్పవని, ప్రాణాలు తీస్తారని తెలిసినా లొంగి బతకడం కన్నా పోరాడి మరణించటమే మేలను కుని దుర్మార్గుడైన ఇసునూరు రామచంద్రారెడ్డి 40 వేల ఎకరాల ఆసామీ, 60 గ్రామాలకు అధిపతిగా నైజాంకు నమ్మినబంటు అయిన ఇతని కొడుకు బాబుదొర (జగన్మోహన్ రెడ్డి) దుర్మార్గా లకు, ఆగడాలను ఎదురించిందన్నారు. చాకలి, మంగలి, గౌడ చేతివత్తుల వారు, రైతులు, కూలీలు దొరలు, దేశ్‌ముఖ్‌ల పీడనలో నలిగిపోతుంటే ఐలమ్మ నిప్పుకణికయ్యి, పోరాట మార్గమైంద న్నారు. నైజాం పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదని, నైజాం రాజు, రజాకార్ల నాయకుడు ఖాశీం రజ్వీ, భూస్వా ముల, అధికారాలకు, దుర్మార్గాలకు, వ్యతిరేకంగా పోరాడిన తెలం గాణ వీరనారి ఐలమ్మ స్పూర్తితో మహిళలు, ప్రజలు, కార్మికులు అందరూ ముందుకు సాగాలని, ఆమె ఆశయ సాధన కోసం కషి చేయాలని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని మండిపడ్డారు. సాయుధ పోరులో కమ్యూనిస్టు కార్యకర్తలు 4000 మంది అమరులయ్యారని, ఏ పాత్ర లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తుండటాన్ని గమనించాలని చెప్పారు. వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, సాయి ప్రసాద్, శ్రీనివాస్, భాస్కర్, మంగ, రఘు, శివ, వనిత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిరంకుశ పాలనపై తిరుగుబాటు : ఎండి అబ్బాస్
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎర్రజెండా ఆధ్వర్యంలో కమ్యూనిస్టు నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యదర్శి ఎం.డి. అబ్బాస్ అన్నారు. శనివారం సంతోష్‌నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో వీరనారి ఐలమ్మ, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వా ములు, జమీందారులు, దేశముఖ్‌లు, పటేల్ పట్వారీలు ప్రజలను జలగల్లా పట్టి పీడించేవారని, నైజాం కాలంలో వెట్టిచాకిరి చేయించేవారని, కౌలు, లెవీ పేరుతో దోచుకునేవారని చెప్పారు. అలాంటి నిజాం నిరంకుశ పాలనను సహించకుండా ఎర్రజెండా కింద ప్రజలను సమీకరించి వీరోచిత పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నాడు కమ్యూనిస్టులు నాలుగు వేల మంది రైతులకు భూములు పంచారని తెలిపారు. అలాంటి మహత్తరమైన పోరాటంలో వందలాది మంది కమ్యూనిస్టులు ప్రాణాలర్పించారని, వేల మంది జైల్లకు వెళ్లారని అన్నారు. ఇలాంటి తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారసత్వం కమ్యూనిస్టుల సొంతమి అన్నారు. ఈ నెల 10 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాలను జరుపుకోవాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో హైదరాబాద్ సౌత్ కమిటీ పరిధిలోని ప్రతి ప్రాంతంలో జరుపుకోవాలని కోరారు. ఈ పోరాటానికి ఎటువంటి సంబంధం లేని బీజేపీ నేడు తెలంగాణ రైతాంగ పోరాటం నిజాం రాజుకు వ్యతిరేకంగా హిందూవులు చేసిన పోరాటంగా చెప్తూ చరిత్రను వక్రీకరిస్తోందన్నారు. ఈ పోరాటం సర్దార్ వల్లభారు పోరాటమని అసంబద్ద ప్రచారాలు సష్టిస్తున్నారని తెలిపారు. ఇటువంటి అబద్దాలతో మతపరమైన గొడవలు సష్టించడం తప్ప వేరే ఆలోచనలు కావని, ఇలాంటి దుష్ప్రచారాలు. మానుకోవాలని, ప్రజలు వాటిని నమ్మకూడదని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్వివర్గ సభ్యులు ఎం.మీనా మాట్లాడుతూ.. భూస్వాముల అరాచకాలను ఎదిరించిన చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని మహిళలు ఐక్య పోరాటాలను నిర్వహించాల్సిన అవసరముందన్నా రు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఎల్.కోటయ్య, జి.విఠల్, రాష్ట్రనాయకులు ఎన్.సోమయ్య, ఎం.శ్రావన్ కుమార్, పి.నాగేశ్వర్ రావు, అబ్దుల్ సత్తార్, జంగయ్య, కిషన్, క్రిష్ణ పాల్గొన్నారు.
ఐలమ్మ ఆశయాలను సాదిద్దాం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ ఆశయాలు సాదిద్దామని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం, కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ అన్నారు. కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం రాజీవ్ గాంధీ నగర్లో శ్రీ మాడెల ప్రజా రజక సేవా సంఘంవద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... భూమికోసం , భుక్తి కోసం ,విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో నిప్పురవ్వల వెలిగి ఎన్నో మహిళా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దేవదానం, బిక్షపతి, నర్సింలు, సునీల్, స్వాతి ,ఆంజనేయులు, శ్రీ మాడేలా ప్రజా రజక సేవా సంఘం అధ్యక్షులు చంద్రం, ప్రధాన కార్యదర్శి శంకర్, సలహాదారులు ఆర్ వెంకటేష్, అంజయ్య, లక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నివాళి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం, వెంగళరావునగర్ డివిజన్, కృష్ణకాంత్ పార్క్ వద్దగల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట ఘట్టాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్య రావు, జిటిఎస్ టెంపుల్ చైర్మెన్ చిన్న రమేష్, గజ్జల బాలకష్ణ, పవన్ ముదిరాజ్, సత్యనా రాయణ, రజక సంఘం చైర్మెన్ ఎస్. రాజు, ప్రెసిడెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ ఆశయాలు నెరవేరలేదు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పిఆర్ హిల్స్ రెండు బొమ్మల సెంటర్ వద్ద, తెలంగాణ రజక వత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 37వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజక వత్తిదారుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిందని, ఐలమ్మ అందుకోసమే పోరాడారని చెప్పారు. వెట్టి చాకిరి పోయింది కానీ భూమి మాత్రం పెట్టుబడిదారులు, భూస్వాముల వద్ద ఉందని, ఆమె ఆశయాల కోసం మళ్లీ భూ పోరాటం చేయాలని రజక సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రజక వత్తిదారుల సంఘం నాయకులు రాపర్తి అశోక్, జి. బిక్షపతి, కె. సుధాకర్, ఇ. లింగమూర్తి, ఏ.ఆర్ నరసింహ, టి. భాగ్యరాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ దుష్ప్రచారాలు తిప్పికొట్టండి
ఐలమ్మ 37వ వర్ధంతి కార్యక్రమం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అడ్డగుట్ట చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి అజరు బాబు మాట్లాడుతూ బీజేపీ దుష్ప్రచారాలను తిప్పికొటాల న్నారు. 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో నైజాం ఎస్టేట్ విలీనం కావడం చారిత్రక వాస్తవమన్నరు. ఆనాడు ఉద్యమంతో సంబంధం లేని పార్టీలు, నాయకులు సాయుధ పోరాటంపై నేటికీ వక్రభాష్యాలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. విముక్తి, విమోచన, విలీనం, విద్రోహం అంటూ ఎవరికి తోచిన నినాదాన్ని వారు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పా ల్సిన బాధ్యతతో సీపీఐ(ఎం) సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవం జరుపుతు న్నదని తెలిపారు. ఈ నెల 11వ తేదీన కమ్యునిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపిచ్చిందని నాటి పోరాటానికి నాయకత్వంలో ఉన్న కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కేంద్ర పార్టీతో సంప్రదించి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్.అంజమ్మ ఎన్.సోమలక్ష్మి, ఎం. అలేఖ్య, ఎం.పరీక్షిత్, ఎం.మరియమ్మ, ఎన్.గోవిందమ్మ, నర్సింగ్ రావు దీనమ్మ, నవీన్, అనురాధ పాల్గొన్నారు.