Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అన్నారు. శని వారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బాపూనగర్‌కు చెందిన గిరిజన సంఘం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల17వ తేదీన సీఎం కేసీఆర్ రూ.53 కోట్లతో నిర్మించిన సేవాలాల్ బంజారాభవన్, కొమురంభీమ్ ఆదివాసీ భవన్లను ప్రారంభిస్తారని తెలిపారు. భవనాల ప్రారంభం అనంతరం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించే వేడుకలకు సీఎం ముఖ్య అథితిగా హాజరవుతారని చెప్పారు. ఈ వేడుకల్లో గిరిజన సంస్కతి, సాంప్రదాయాలను తెలియజెప్పే కళా ప్రదర్శన లు, కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, హరిసింగ్ జాదవ్, కిషన్ సింగ్, బాలు నాయక్, సీతారాం, రాజు నాయక్, రాణి భాయి, విక్రమ్ రాథోడ్్ తదితరులు పాల్గొన్నారు.