Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఎల్వీపీఈఐలో మరింత బలోపేతం కానున్న ఆప్తాల్మిక్ ప్లాస్టిక్ సేవలు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ క్యాంపస్‌లోని ఆప్తాల్మిక్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్‌కు మద్దతు అందిస్తున్న కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్కు చెందిన రిషా కిలారు డాక్టర్ గంగాధర్ ప్రసాద్ కిలారులా రిషా కిలారు తల్లిదండ్రుల గౌరవార్థం ఈ కేంద్రానికి ఇప్పుడు 'హరిరామ్ మోతుమల్ అండ్ రేణు హరిరామ్ నాస్తా ఆప్తాల్మిక్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్' అని పేరు పెట్టారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లాస్టిక్ సర్జన్ రిషా కిలారు, డాక్టర్ గంగాధర్ ప్రసాద్ కిలారు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఆప్తాల్మిక్ ప్లాస్టిక్ సేవలను మరింత బలోపేతం చేయడా నికి విస్తరించడానికి తమ సహాయాన్ని అందించారు. ఆప్తాల్మిక్ ప్లాస్టిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి అత్యంత ప్రత్యేకమైన రూపం, ఇది వైకల్యాలు, కణితులు, ఆర్బిటల్ ఫ్రాక్చర్లు (కనుగుడ్డు చుట్టూ ఉన్న ఎముకలలో ఒకదానిలో విరిగిపోయినప్పుడు) కంటి చుట్టూ ఉన్న నిర్మా ణాల కాస్మటిక్ సమస్యలతో వ్యవహరించే నేత్ర వైద్యం ప్రత్యేక విభాగం. ఈ ఆప్తాల్మాలజీ విభాగం సమయాను కూలమైన జోక్యాలతో దృష్టిని జీవితాన్ని కాపాడటమే కాకుండా వ్యక్తుల ముఖ కంటి రూపాన్ని మెరుగ్నుపరు స్తుందని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రెండు దశాబ్దాలుగా ఆప్తాల్మిక్ ప్లాస్టిక్ సేవలను అందిస్తున్నది. ఎల్వీపీఈఐలోని అత్యాధునిక ఆప్తాల్మిక్ ప్లాస్టిక్ సెంటర్, అనుభవజ్ఞునులైన నేత్రవైద్యులు ఆప్టోమెట్రిస్టుల బృందంచే సదుపాయాలు కల్పిస్తున్నారు.