Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
ప్రజలు డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కింగ్‌కోఠి క్లస్టర్ డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్ పద్మజ అన్నారు. శనివారం ఇసామియా బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గాడి ఖన బస్తీ దావఖాన పరిసర ప్రాంతాల్లో డెంగ్యూ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు మొదలు పెద్దల వరకు ఈ వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. దోమ కాటు వల్ల వ్యాపించే ఈ డెంగ్యూ జ్వరం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వడం, పరిసరాల పరిశుభ్రతతో ఉండాలని సూచించారు. పరిశుభ్రత పాటిస్తే డెంగ్యూ జ్వరం రాకుండా అరికట్టవచ్చనన్నారు. ఈ జ్వరం అంటువ్యాధి కాదు అనీ, కేవలం దోమ కాటు వల్లే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నారు. డెంగ్యూ జ్వరం ఏడిస్ ఈజిప్ట్బ అనే దోమ కాటు వల్ల వ్యాపిస్తుంది తెలిపారు. డెంగ్యూ వైరస్ ప్లావీ విరిడే అనే జాతికి చెందింన్నారు. ముఖ్యంగా ఈ దోమ ఉదయం వేళల్లో కాటు వేయడం వల్ల డెంగ్యూ జ్వరం వ్యాపిస్తుంది అని పేర్కొన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వృద్ధి చెందే దోమ కాటు వల్ల వ్యాపిస్తుందని తెలిపారు. హై గ్రేడ్ ఫీవర్, తలనొప్పి, నడుం నొప్పి, కంటి వెనుక భాగంలో లాగినట్లు అనిపించడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలతో మొదలయ్యే ఫీవర్ మొదటి మూడు, నాలుగు రోజులు జ్వరం ఆ తర్వాత ప్లేట్లెట్ కణాలు తక్కువ అవుతాయని తెలిపారు. రెండు రోజుల కంటే ఎక్కువగా హై ఫీవర్‌తో బాధపడే వారు సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే డెంగ్యూ బారిన పడకుండా ఉండొచ్చని సూచించారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామనీ, అవసరమైన వారికి వెంటనే మందులను అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వ్యాధులపై కరపత్రాలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇసామియ బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహిక, గాడిఖాన బస్తీ దవఖాన డాక్టర్ మల్లికార్జున్, మలేరియా ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి. ల్యాబ్ టెక్నీషియన్ సునీల్, ఏఎన్ఎం జయలక్ష్మి, సూపర్వైజర్ పవన్, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.