Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
రూ.9.50 కోట్లతో ఆధునీకరించిన బేగంబజార్ చేపల మార్కెట్ భవనాన్ని శనివారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోనే రెండో అతిపెద్ద చేపల మార్కెట్ బేగంబజార్ చేపల మార్కెట్ అన్నారు. ఏండ్లుగా ఇక్కడ పనిచేస్తున్న చేపల వ్యాపారుల కు ఈ భవనంలో స్టాళ్లు కేటాయించి వారి పేర్లను మార్కెట్ ముందు డిస్ ప్లే చేస్తామన్నారు. డిస్ ప్లేలో ఉన్నవారే ఈ మార్కెట్లో స్టాల్ కేటాయిస్తామని తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫిషరీ అధికారులు చూసుకోవాలని సూచించారు. ఈ మార్కెట్‌కు ఎంతో చరిత్ర ఉందని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు బేగంబజార్ చేపల మార్కెట్ గురించి మాట్లా డారని గుర్తు చేశారు. ఈ మార్కెట్లో మార్కెటింగ్. రిటైల్. హౌల్ సేల్ లాంటి వ్యాపారాలు మూడు ఫ్లోర్లో చేసుకోవాలని చేపల వ్యాపారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాపార సముదాయంలో పరిశుభ్రత పాటిం చాలని తెలిపారు. ఫిషరీ కమిషనర్ లచ్చురాం నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడు ఫిషరీ మార్కెట్ రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపారు. రూ.తొమ్మిదిన్నర కోట్లతో ఆధునికరించి వ్యాపా రులకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల చేపల వ్యాపారాలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, అబిడ్స్ సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్ డిడి నాయక్, ఏఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ దేవానంద్, దత్తు, ఈఈ ప్రకాశం, సీఈ సురేష్, డీఈ సంధ్య, డిప్యూటీ డీిఈ మణిపాల్, ఏఈ సాయి చరణ్, వెటర్నరీ డాక్టర్ సబిత, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, టీఆర్ఎస్ గోషామాల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రేమ్ సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ ఉద్యమకారులు ఆర్వి మహేందర్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్, మాజీ కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, పరమేశ్వరి సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్, రామచందర్ రాజు, సంతోష్ గుప్తా, ప్రియా గుప్తా, చాపల మార్కెట్ అసోసియేషన్ నాయ కులు, తదితరులు పాల్గొన్నారు.