Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు నిందితులకు రిమాండ్
నవతెలంగాణ- వనస్థలిపురం
నగరానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులతో పాటు, ఆశిష్ ఆయిల్ తరలిస్తున్న మరో ఇద్దరు నిందితులను ఎస్ఓటి, లా అండ్ ఆర్డర్ పోలీసులు అదుపులోకి తీసుకుని 50 కేజీల గంజాయి, మూడు లక్షల విలువైన ఆశిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్న సంఘటన హయత్‌నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం వనస్థలిపురం ఏసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వనస్థలిపురం ఏసీపీి పురుషోత్తం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుండ్రపల్లి శివరెడ్డి(34), అమ్మిరెడ్డి (29), నరసయ్యలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణం పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి కిలో గంజాయి ఐదు వేలకు కొనుగోలు చేసి శివారెడ్డి, నర్సయ్యలు నగరానికి తీసుకువచ్చి మరో వ్యక్తి అమ్మిరెడ్డిని భాగస్వామ్యం చేసుకుని 50 కేజీల గంజాయిని నగరానికి తీసుకొ స్తుండగా విశ్వసియ సమాచారం మేరకు ఎస్ఓటీ ఎల్బీనగర్, హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదే విధంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి చెందిన నాగరాజు(25), మోహన్(26) ఇద్దరూ కలిసి మూడు లక్షల విలువ గల ఆశిష్ ఆయిల్ ను నగరానికి తీసుకొస్తుం డగా మల్కాజ్గిరి ఎస్ఓటి, వనస్థలిపురం పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు సుష్మ చౌరస్తా వద్ద వారి ఇద్దరినీ తనిఖీ చేయగా మూడు లక్షల విలువ గల ఆశిష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లు, 500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని నింది తులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు పోలీసులు నిందితుల్ని రిమాండ్‌కి తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఎంతో చాకచక్యంగా గంజాయి, ఆశిష్ ఆయిల్‌ను తరలిస్తున్న నిందితులను పట్టుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటి ఏసీపీ వెంకట్ నాయక్ వనస్థలిపురం సీఐ సత్యనారాయణ, డిటెక్టివ్ సీఐ వెంకటయ్య, హయత్‌నగర్ సీిఐ వెంకటేశ్వర్లు, డిటెక్టివ్ సీఐ నిరంజన్, ఎల్బీనగర్ ఎస్ఓటి సీఐ సుధాకర్‌లను ఉన్నత అధికారులు అభినందించి రివార్డులను అందజేశారు.