Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణ మాత్రం కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ద్వారా హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైందని సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం సెప్టెంబర్ 11, 1947లో మొదలైందనీ, నాటి నుంచి మొదలుకుని ఏడాదిపాటు సాయుధ పోరాటం నిర్వహించామని అప్పటివరకు రాని పటేల్, ఎక్కడ తెలంగాణ మొత్తం కమ్యూనిస్టుల చేతిలోనికి వెళుతుందేమోనని భయపడి 1948 సెప్టెంబర్ 13 తెలంగాణకు వచ్చి నిజాంను లొంగదీసుకుని తెలంగాణను విలీనం చేసుకున్నారని తెలిపారు. నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు అది పటేల్ సైన్యం వల్లే విలీనమైందని చరిత్రను వక్రీకరిస్తూ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య పోరాటంను తెలంగాణ ప్రజల పోరాటాన్ని వక్రీకరిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు మన చరిత్రను రక్షించుకోవడానికి బీజేపీ చేస్తున్న ఆసత్య ప్రచారాన్ని తిప్పికొట్టి మన సాయుధ పోరాట వారసత్వాన్ని కాపాడు కుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాటి తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన చాకలి పిచ్చయ్య కుమారుడు చాకలి నర్సింహతో పూల దండతో నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, కోశాధికారి సదానంద, ఏఐవైఎఫ్ కార్యదర్శి వెంకటేష్, అధ్యక్షుడు సంతోష్, మండల కార్యవర్గ సభ్యులు సహదేవ్, కృష్ణ శ్రీనివాస్, వెంకటేష్, మండల నాయకులు సుధాకర్, శేఖర్, నరసయ్య, సాయిలు, శామ్యూల్, కయ్యుమ్, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.