Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏఐసీటీయూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న కార్మిక వర్గంపై మోయలేని భారాలను వేసి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏఐసీటీయూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్ అన్నారు. ఆదివారం నాగారం మున్సిపాలిటీలో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఏఐసీటీయూ జిల్లా కార్యాలయంలో కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఏఐసీటీయూ అధ్యక్షుడు ఆర్.రామచందర్, కార్యదర్శి మారం రామస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎర్ర రాజేష్ మాట్లాడారు. దేశ అభివృద్ధికి తోడ్పాటుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులకు మడుగులు వత్తాసు కార్మికుల చట్టాల రద్దుకు పార్లమెంట్లో అంగీకరించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు దాదాపు రూ.3 వేల కోట్ల నిధులు సంక్షేమ బోర్డులో జమయ్యాయనీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రావాల్సిన రూ.450 కోట్లు బ్యాంకులో మూలుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 36వేల క్లెయిమ్స్ ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయనీ, పైగా లేబర్ సంక్షేమ బోర్డులో ఉన్న రూ.10005 కోట్ల నిధులను అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల, అ సంగటిత కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై అన్ని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలను కలుపుకుని భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం కార్మిక సంఘం చర్చలు జరపడానికి సిద్ధం గా ఉందన్నారు. ఇప్పటికే భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికులు కార్మిక సంఘాలు అనేక పోరాటాలు నిర్వహించి వామపక్ష పార్టీల అండతో 1996లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం సాధించుకున్నట్టు గుర్తు చేశారు. 1998లో సెస్సు చట్టం వచ్చిందనీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని అనుసరించి లేబర్ సంక్షేమ వెల్ఫేర్ బోర్డు ఏర్పడిందని తెలిపారు. పని ప్రదేశంలో ప్రమాదంలో మరణించినా, సహజ మరణానికి, పెళ్లి కానుక, ప్రసూతి కానుక, పిల్లల స్కాలర్షిప్లు, వృద్ధాప్య పింఛన్, వంటి అనేక సంక్షేమ పథకాలు నేడు భవన ఇతర నిర్మాణ కార్మికుల చట్టంలో ఉన్నాయి కానీ అందులో పిల్లల స్కాలర్షిఫ్, పింఛన్లు కార్మికులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్మిక చట్టం ప్రకారం కార్మికుల పేర్లు నమోదు చేసుకుని సమాన పనికి సమాన వేతనం, పునరావాసం పిల్లలకు విద్య, వైద్యం, కార్మికుడికి స్వస్థలం నుంచి రానుపోను చార్జీల వంటి సౌకర్యాలు ఈ చట్టం వల్ల భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల రక్షణ, చట్టాల్లో ఉండేవనీ, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుచేసి కార్మికులకు అన్యాయం చేశాయన్నారు. రాబోవు కాలంలో అన్ని వామపక్ష పార్టీల కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకుని కార్మిక చట్టాల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కన్వీనింగ్ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఆర్.రామచందర్, అధ్యక్షులుగా మారం రామస్వామి, ఉపాధ్యక్షులుగా ఈ.బాలయ్య, ఏ.వరద రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.గణేష్, సహాయ కార్యద ర్శిగా ఎస్.జైపాల్, కె.రవీందర్ గౌడ్, కోశాధికారిగా యన్ నాగరాజ్, జిల్లా కమిటీ సభ్యులుగా కె.కృష్ణ, శ్రీనివాస్, పి.రాజు, మలాద్రి 11 మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, తదితర నాయకులు పాల్గొన్నారు.