Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్/అడిక్‌మెట్
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తార మైదాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలువురు చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా సూరజ్ భవన్ క్లస్టర్ ఎస్‌పీహెచ్ ఓ డాక్టర్ సునంద మాట్లాడుతూ 1-2 ఏండ్ల పిల్లలకు అల్బెండజోల్ మాత్రను సగం ఇవ్వాలని, 3-19 ఏండ్ల వరకు ఉన్న వారికి ఒక మాత్రను వేయాలని సూచించారు. తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ చిన్నారులకు మాత్రలను వేయించాలని ఈవిషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిన్న పిల్లలు ఆహారం తీసుకునే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రజిత, ఏఎన్ఎంలు లక్ష్మి, పుష్పలత, ఫార్మసిస్ట్ స్రవంతి, అకౌంటెంట్ మాధవి, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేష్, ఆశావర్కర్లు హైమది, విజయలక్ష్మి, రజిత, సంధ్య, లావణ్య, విజయ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అవగాహన కలిగిఉండాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. పిల్లలకు అజీర్తి, జీర్ణ వ్యవస్థలో సమస్యలను కల్పించే నులిపురుగుల నివారణ మందును తప్పనిసరిగా ప్రతి చిన్నారికి వేయించాలని సూచించారు. గురువారం గాంధీ నగర్ డివిజన్ జవహర్‌నగర్ అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అభ్యుదయ హైస్కూల్ లలో పిల్లలకు నులిపురుగుల నివారణ మందు చుక్కలను వేశారు. కార్యక్రమంలో యువ నాయకులు వినరు కుమార్, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ స్వర్ణలత, అభ్యుదయ స్కూల్ ప్రిన్సిపల్ ఉమా, అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.