Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
నవతెలంగాణ-బంజారాహిల్స్
చిన్న సినిమాలను ప్రోత్సహించాలని, వాటిని తక్కువ అంచనా వేయకూడదని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. ఏఆర్ఆర్, ఏజీఎస్ మీడియా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్ర ప్రారంభోత్సవానికి హాజరై కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో చిన్న సినిమాలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయన్నారు. ఏడాదికి పెద్ద సినిమాలు మహా అంటే ఒక డజను వస్తూ ఉంటాయని, మిగతావన్ని చిన్న చిత్రాలదే హవా అన్నారు. నూతన నటీనటులతో వైవిధ్యభరితమైన కథనంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ మొదటివారంలో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ఉంటుందని దర్శకుడు నందు యార్లగడ్డ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు గుండ్ల గణేష్, రవికుమార్, సంగీత దర్శకులు ఎం.ఎం.రాజా, కిక్ రాము, ఆద్యశ్రీ, నీహారిక, ప్రణీత రాజ్, డీఓపీ శ్రీరామ్, ఎడిటర్ తిరుపతి రెడ్డి, పాటలు పెద్దాడ మూర్తి, డిజైనర్ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.