Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలిటికల్ జేఏసీ చైర్మెన్ రాచాల యుగంధర్ గౌడ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకుంటే కేసీఆర్‌ను ముంచేస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మెన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. చదువుకున్న, నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీసీ మంత్రిత్వ శాఖను కేవలం గురుకులాలకే పరిమితం చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. బీసీలు నిశ్శబ్ద విప్లవకారులని, సమయం వచ్చినప్పుడు బొంద పెట్టేందుకు కూడా వెనకాడమన్నారు. మునుగోడులో 70 శాతం బీసీలు ఉన్న సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో దూదేకుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సత్తార్ సాహెబ్, తెలంగాణ సామాజిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోటికె రాము, శశికుమార్ గౌడ్,మహీందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.